TEJA NEWS

సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు కృషి చేయాలి

-మండల జర్నలిస్టు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు కృషి చేయాలని తహసిల్దార్ కృష్ణయ్య ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు సంబంధించిన జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో విలువైందన్నారు. సమస్యల పోరాటంలో జర్నలిస్టుల సేవలను కొనియాడారు. అనంతరం మండల జర్నలిస్టు సంఘం గౌరవ అధ్యక్షులుగా రమేష్ చారి,ప్రాణేష్ చారి, అధ్యక్షులుగా షఫీ, ఉపాధ్యక్షులుగా ఎల్ల స్వామి, కోశాధికారిగా మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు శ్రీనివాసులు, కార్యదర్శిగా మీర్జా వసీం బేగ్, కార్యవర్గ సభ్యులుగా శీను సంతోష్ అశ్విక్ హుస్సేన్ మహమ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జర్నలిస్టుల సంఘం సభ్యులను తహసీల్దార్ కృష్ణయ్య ఎంపీడీవో శ్రీనివాసరావు అభినందించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టు సంఘం సభ్యులు పాల్గొన్నారు.