TEJA NEWS

ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి

ప్రింటు, ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేట లొ తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షులు కోడి సైదులు ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 13వ తేదీ న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి,ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి లింగన్న, మహిళా ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోతి మాధవి రెడ్డి, తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, పి ఎస్ యు అధ్యక్షులు ఆవుల నాగరాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారిందని,
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు, ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమం కు ఫోటో, వీడియో,ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక సంఘం నాయకులు బాబన్న, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కొమ్ము శంకర్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె యూసుఫ్ షరీఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కపాక కృష్ణ
సహాయ కార్యదర్శి మేడబోయిన గంగయ్య జిల్లా అధ్యక్షులు లింగంపల్లి మురళి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర కోశాధికారి సతీష్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు
సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక సూర్యాపేట పట్టణ అధ్యక్షురాలు గోనె విజయమ్మ ప్రధాన కార్యదర్శి బంటు ఎల్లమ్మ మహిళా వేదిక జిల్లా నాయకులు తండ దేవిక సుజాత ఖమ్మంపాటి లక్ష్మమ్మ సాయిని సుగుణమ్మ సోమమ్మ ఉమ తొలిదశ ఉద్యమకారులు కోతి మధుసూదన్ రెడ్డి ఉబ్బని రత్నయ్య కృష్ణారెడ్డి మన్నన్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.