TEJA NEWS

జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన జర్నలిస్టులు

సూర్యపేట జిల్లా : జ్యోతిబాపూలే 199వ జయంతి సందర్భంగా సూర్యాపేటలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు జర్నలిస్టు మాట్లాడుతూ జ్యోతిబాపూలే ఆశయాలు ఇంకా మిగిలి ఉన్నాయంటే ఆయన బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం సమాజంలో తారతమ్యాలు లేకుండా ప్రత్యేకంగా స్త్రీల విద్య కోసం ఎంతో కృషి చేశారు. జ్యోతిబాపూలే ఆశయాల కోసం నిరంతరం జర్నలిస్టుల తరఫున సమాజంలో తారతమ్యం లేకుండా మనుషులంతా సమానం అనే భావనతో మెలిగే విధంగా తమ వంతు చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు…