TEJA NEWS

చదువును నిరాకరించిన బ్రాహ్మణులకే చదువును అందించిన జ్యోతిబా ఫూలే.
బీసీ,ఎస్సీ,ఎస్టీ నాయకులు.
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్బంగా శుక్రవారం సాయంత్రం బీసీ హక్కుల సాధన సమితి,దళిత హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శ్రీనివాస్ నగర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద బీసీ నాయకులు కృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జ్యోతిబాపూలే కంటే ముందు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి బ్రాహ్మణులు చదువును నిరాకరించడం వల్ల విద్యకు దూరమయ్యారని జ్యోతిబాపూలే తన తండ్రి సహకారం వల్ల చదువుకొని సమాజంలో అసమానతలకు కారణం విద్య లేకపోవడం అని భావించి అందరికీ చదువును అందించాలని లక్ష్యాన్నిపెట్టుకొని ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే కు చదువును నేర్పించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పాఠశాలను ప్రారంభించిన మహానుభావుడు మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు. మహాత్మ జ్యోతిబాపూలే అన్ని వర్గాల వారికి చదువులు చెబుతుంటే తట్టుకోలేని బ్రాహ్మణులు వారి తండ్రి దగ్గరికి వెళ్లి నీ కుమారుడు అందరికీ చదువు చెప్పడం ధర్మ వ్యతిరేకమని కాబట్టి చదువును చెప్పవద్దని లేకపోతే ఇంటి నుంచి పంపియాలని హెచ్చరించారు, ఇదే విషయాన్ని జ్యోతిబాపూలే తండ్రి జ్యోతిబాపూలే గారికి చెప్పితే ప్రజలకు చదువు చెప్పడమే తన లక్ష్యమని ఇంటి నీ సైతం వదులుకొని ప్రజల కోసం బ్రాహ్మణులు భౌతిక దాడులకు, మానసికపరమైనటువంటి దాడులకు, ఆర్దికపరమైన దాడులకు దిగినా బెదరకుండా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆరోజు పాఠశాలలు ప్రారంభించి చదువు చెప్పడం వల్లనే నేడు వెనుకబడిన కులాల వారికి అందరికీ చదువు లభించిందని, ఈ చదువు వల్లనే నేడు అందరూ సమాన స్థాయికి చేరుకుంటున్న సందర్భంలో తట్టుకోలేని బ్రాహ్మణ వర్గం మరొకసారి ప్రజలను మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో మనసులో చోప్పించి ప్రజలకు కావలసినటువంటి విద్య గురించి ఆలోచించకుండా చేస్తున్నారని, ఈ కుట్ర తెలియకుండా అమాయకులైనటువంటి యువకులు, ప్రజలు మత రాజకీయాల వైపు మల్లుతున్నారని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అందరిపైనా ఉన్నదని అన్నారు. ప్రజలు తమ మతాన్ని తమ దేవుళ్ళను తమ సంస్కృతిని కాపాడుకోవాలంటే ముందుగా అందరికీ విద్యా అందించాలని ఆ విషయాన్ని నేటి పాలకులు ఆ విషయాన్ని చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విద్యను అందించడమే సమాజంలో సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయడమే మహాత్మ జ్యోతిబాపూలేకు మనం ఇచ్చే అసలైన నివాళులని అన్నారు.
*ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం బీసీ హక్కుల సాధన సమితి నాయకులు ఉమామహేష్, వి శ్రీనివాస్, ప్రవీణ్, రాములు, సహదేవ రెడ్డి,బాబు, సదానంద్, వెంకటేష్,సాయిలు, శేఖర్, నరసింహారెడ్డి, యాకూబ్, ఇమామ్, నర్సయ్య,హరినాథ్, యాదయ్య, యాకూబ్, ప్రభాకర్, సుంకిరెడ్డి, సామెల్,చంద్రకాంత్, జర్నలిస్టులు మోహన్ బైరాగి, డప్పు రామస్వామి, వెంకట్, పాల్గొనగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ నాయకత్వంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు భాస్కరా చారి, వాసు, బాలరాజ్, చందులు తమ ఆటపాటలతోటి ఉత్తేజపరమైనటువంటి పాటలను ఆలపించారు.