
విద్యతోనే ప్రాధాన్యత లభిస్తుందని జ్యోతిబాపూలే గుర్తించారూ
మహిళల చదువుతోనే సమాజం అభివృద్డి : కలెక్టర్ తేజస్
సూర్యపేట జిల్లా : సమాజంలో విద్యకి చాలా ప్రాధాన్యత లభిస్తుందని జ్యోతిబా పూలే గుర్తించారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సూర్యాపేట పట్టణం లో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే 199 వ జయంతి ఉత్సవ కార్యక్రమం లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్య వలన ప్రాధాన్యత, గుర్తింపు లబిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే అని , ఆనాటి కాలంలో అస్పృశ్యత, లింగ వివక్షత ఉండేదని వాటిని నిర్ములించేందుకు, వితంతువులకి పునర్విహం చేసేందుకు జ్యోతిబా పూలే ఎంతగానో కృషి చేసారని అన్నారు.మహిళ సాధికారత లభిస్తే వారు సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని జ్యోతి బాపూలే సోదరికి,భార్య సావిత్రి బాపూలేకి చదువు చేప్పి మొదటి మహిళల ఉపాధ్యాయురాలుని తయారుచేయటంతో మొదటి అడుగు వేశారని వారిని ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు అంతరిక్ష యాత్రలు చేసే స్థాయి కి ఎదిగినారని తెలిపారు. జ్యోతిబా పూలే ఆశయాలు అమలులో భాగంగా నేడు కార్పొరేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత అర్హతలున్న ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను బోదిస్తున్నామని, ఉచితంగా యూనిపారం, పుస్తకాలు, నోట్ బుక్స్ నాణ్యమైన భోజనం, ఆర్ ఓ త్రాగునీరు అందిస్తున్నామని, జిల్లాలో 13 ప్రాధమిక పాఠశాలలో ఆర్టిపిషియల్ ఇంటెలిజెంట్ ని ఉపయోగించి చదువు చెప్పటం జరుగుతుందని,ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోర్డులు ద్వారా బోదించటం జరుగుతుందని తెలిపారు. పాఠశాలకి వెళ్ళని విద్యార్థులని గుర్తించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందరిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.జిల్లాలో చదువు రాని విద్యార్థులు ఉండకూడదని అన్నారు. మనం అందరం తెలిసిన విద్యార్థులని ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకోవాలని మంచిగా చదివే వారికి ఏదైనా బహుమతి ఇచ్చి ప్రోత్సాహించాలని సూచించారు.
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ…
అంటరానితనం నిర్ములించేందుకు, మహిళల విద్య , విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని,అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థానానికి చేర్చేందుకు జ్యోతిబా పూలే ఎంతగానో కృషి చేసారని,జ్యోతిబా పూలే ఆశయాలు సాధించిన రోజునే మనం వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బాపూలే అడుగుజాడల్లో నడుస్తూ కులగణన చేసిందని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలను అందించాలని అన్ని రంగాలలో 42 శాతం అమలు చేసేందుకు అసెంబ్లీ లో చట్టం చేసి పార్లమెంట్ కి పంపటం జరిగిందని తెలిపారు. అనంతరం బి సి ఉద్యోగుల డైరీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పి నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్,బి సి అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, కుల సంఘ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
