TEJA NEWS

జ్యోతిరావు పూలే జయంతి.. బిసి కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మమేకం

▪️ త్వరలోనే బీసీలకు రక్షణ చట్టం

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కులవృత్తులు చేసుకునేవారి ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులవృత్తులవారిని కలుసుకుని వారి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో యాదవ సంఘం నేతలు సీఎంకు గొర్రె పిల్లను బహూకరించారు.
అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. త్వరలోనే బీసీలకు రక్షణ చట్టం తెస్తామని.. ఇప్పటికే కమిటీ వేశామని సీఎం చంద్రబాబు అన్నారు. బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక రుణాలు అందించారు.