TEJA NEWS

కాకాణి – ఆజ్ఞాతవాసి!

నెల్లూరు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆజ్ఞాతంలో కొనసాగుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. సుప్రీంకోర్టులో బెయిల్ లభించకపోవడంతో బయటికి రావడం తప్ప మిగిలిన దారులు మూసుకుపోయాయి. కానీ ఆయన ఇంకా లొంగకపోవడం, పరారీలో కొనసాగడం ప్రశ్నలు రేపుతోంది.

పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చని తెలిసినా, కాకాణి దాగిపోవడం వెనక అసలు భయం వేరే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. “జైలు పెద్ద విషయం కాదని” జగన్ నేతలు చెబుతున్నా, కాకాణి మాత్రం అడుగు ముందుకు వేయడంలేదు.

బయటికి రాకుండా ఉండి, ఆరోపణలు వేరేవారిపై మళ్లించడం, వైసీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడమే కాకాణి ప్రస్తుత వ్యూహంగా కనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు అన్ని మార్గాలు మూసుకుపోయిన తరుణంలో, అజ్ఞాతం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.