TEJA NEWS

నేటి నుంచి కాళేశ్వర సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరిగాయి.. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి సారి ఈ పుష్కరాలు జరుగుతున్నాయి.

గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహిని గా కలిసే ఈ పవిత్ర స్థలంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు కొనసాగు తుంది. 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగను న్నాయి. బృహస్పతి మిథు న రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి.

గురువారం వేకువజామున 5.44 గంటలకు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించా రు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరం గా ముస్తాబు చేశారు.