
24 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం
TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ పనుల్లో అవకతవకలు గుర్తించేందుకు ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ నెల 24 నుంచి మలిదశ బహిరంగ విచారణను ప్రారంభించనుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్లు, మాజీ ఈఎన్సీలు సహా కీలక వ్యక్తులను కమిషన్ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత నెలలో పలువురిని విచారించి, వాంగ్మూలాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
