
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి ,బాలానగర్ మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో బాలనగర్ మండలానికి సంబంధించి 145 మంది లబ్ధిదారులకు మరియు కూకట్పల్లి మండలానికి సంబంధించి 80 మంది లబ్ధిదారులకు మొత్తం 225 మందికి చెక్కులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డ పెళ్లయితే వారి ఇబ్బందులు తెలుసుకొని వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మొదట యాబై ఒక్కవేలను ఇచ్చేవారని తర్వాత 71 వేలుగా చేసి మళ్లీ ఆయన అంతటాయిని ఒక లక్షా నూట పదహారు రూపాయలు దేశంలో ఎక్కడా లేనివిధంగా.. అందించడం జరిగిందని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారని ఇప్పటికీ అది నోచుకోలేదని.. లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని అన్నారు.. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్ ,పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, మందడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబురావు ,మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్..mro లు శ్రీనివాస్..స్వామి, నాయకులు ప్రజలు పాల్గొన్నారు…
