
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి,/ షాదీ మూరక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు కె.టి దొడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామానికి చెందిన ఆడపడుచులకు కళ్యాణి లక్ష్మి/ షాదీమూరక్ చెక్కులను * ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగినది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల కోసం సీఎం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్లికి కానుకగా 1 లక్ష 116 రూపాయలను అందించడం జరుగుతుంది.
కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నరహరి గౌడ్, నాయకులు శ్రీరాములు రామాంజనేయులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
