Spread the love

కళ్యాణం కమనీయం.. శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు

అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కళ్యాణ మహోత్సవం

ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం – పుష్ప దంపతులు

నల్గొండ జిల్లా :- నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక తెల్లవారుజామున అర్చక బృందం వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు.. స్వామివారి కళ్యాణం వేడుకను జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తిలకించారు గుట్టపై జనసంద్రంగా మారింది..

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు..