
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర జన్మదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దారపనేని,బైరెడ్డి
కనిగిరి
కనిగిరి నియోజకవర్గం కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, కనిగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ, ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు ఆరోగ్యంపై భరోసా కల్పిస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే స్వర్గీయ ఎన్టీఆర్ నానుడిని నిజం చేస్తున్న డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి జయరామిరెడ్డి వెంకటేశ్వర స్వామికి బంగారు ఉంగరాన్ని బహుకరించారు. టి ఎన్ ఎస్ వి ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి పోక నాయుడు బాబు, దారపనేని రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు గాజులపల్లి వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు
