మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం

TEJA NEWS

మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ …

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్చార్జులు, అదేవిధంగా (SSA ) సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన కోఆర్డినేటర్లకు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్ సమావేశాన్ని నిర్వహించారు…

ఈ సమావేశంలో మంత్రి కొన్న ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని సంస్థ గతంగా బలోపేతం చేయడానికి తీసుకోవలసిన అంశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు, అదేవిధంగా,SIR (ఓటరు జాబితా సవరణ) నియోజకవర్గ పరిధిలోని కోఆర్డినేటర్ కార్యకర్తలను సమన్వయం పరిస్థితి ఓటర్ల తొలగింపు జరగకుండా చూడాలని తెలిపారు..

అనంతరం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై స్థానిక ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్చార్జిలు అదేవిధంగా కోఆర్డినేటర్లతో వివరాలను తెలుసుకొని, పార్టీ బలోపేటానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి సూచించారు, అదేవిధంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని తెలియపరిచారు…

అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో (బూత్ లెవల్ ఏజెంట్) బిఎల్ఏ ప్రక్రియను వేగవంతం చేసి జాబితాను తొందరగా పిసిసికి అందజేయాలని నాయకులను ఉద్దేశించి తెలియజేశారు…

అనంతరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ ఏఐసిసి సెక్రెటరీ సచిన్ సావన్ మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన జూమ్ కాల్ కాన్ఫరెన్స్ లో నాయకులందరూ కలిసి పాల్గొన్నారు..

అనంతరం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్చార్జిలు కోఆర్డినేటర్లు పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులైన శ్రీశైల గౌడ్ కి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు సత్యం మేడిపల్లి , కవ్వంపల్లి సత్యనారాయణ , నియోజకవర్గ ఇన్చార్జిలు ఒడితల ప్రణవ్, కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు అంజన్ కుమార్, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు బొమ్మ శ్రీరాం , కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సౌజన్య గౌడ్, దూడెం వెంకటరమణ, ఫక్రుద్దీన్, రాజ్ దెఖపాటి, తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top