Spread the love

ఇఫ్తార్ విందుకు హాజరైన కవితక్క, పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం లోని మహమ్మద్ గూడా లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎం.ఎల్.సీ. కవిత, సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.సీ. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభా తృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రం అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు. ఇఫ్తార్ విందుకు హాజరు కావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ముస్లిం లు పవిత్రంగా భావించే రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్దుల్, మునావర్, యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.