
శ్మశాన వాటికలు శుభ్రంగా ఉంచండి..
కమిషనర్ ఎన్.మౌర్య
శ్మశాన వాటికలను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం బాలాజి కాలని లోని శ్మశాన వాటికను, బాలాజి కాలని, ఎల్.ఐ.సి.రోడ్డు, సంస్కృత విద్యాపీఠం, రిజర్వాయర్ కాలని తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేష్, నరసింహ ఆచారి, హెల్త్, ఇంజినీరింగ్ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని శ్మశాన వాటికలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు.
రిజర్వాయర్ కాలనిలో వాటర్ ట్యాంక్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిశుభ్రమైన నీరు సరఫరా చేయాలని అన్నారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని పిర్యాదులు వస్తున్నాయి పరిష్కరించాలని వెటర్నరీ అధికారిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మధు, ఏసిపి బాలాజి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
