
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసి.. ప్రియుడితో సెకండ్ షో సినిమాకు వెళ్లిన కూతురు
ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రిని చంపిన కూతురు
హైదరాబాద్–కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం(45) అనే వ్యక్తి ఒక అపార్టుమెంటులో వాచ్మెన్ గా పనిచేస్తుండగా, జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తున్న అతని భార్య శారద(40)
వారి కూతురు మనీషా(25)కి వివాహం జరగగా, జావీద్(24) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమెను వదిలేసిన భర్త
దీంతో మౌలాలిలోని అద్దె ఇంట్లో ప్రియుడితో కలిసి ఉంటున్న మనీషా
కూతురు వేరే వాళ్లతో కలిసి ఉండడం నచ్చక తరచూ మనీషాతో గొడవ పడుతున్న తండ్రిపై కోపం పెంచుకున్న మనీషా
తన భర్త తనను కూడా అనుమానిస్తూ వేధిస్తున్నాడని కూతురుకి తెలిపిన మనీషా తల్లి శారద
దీంతో ఎలాగైనా తండ్రి అడ్డును తొలిగించుకోవాలని, అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్న మనీషా
ఈ నెల 5వ తేదీన మనీషా ఇచ్చిన నిద్ర మాత్రలు కల్లులో కలిపి భర్తకు ఇచ్చిన శారద
అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత లింగం మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద
హత్య అనంతరం ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లి సినిమా పూర్తయ్యాక తండ్రి శవాన్ని ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామ చెరువులో పడేసిన మనీషా
7వ తేదీన చెరువులో మృతదేహం ఉందని సమాచారం అందుకొని, ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
మృతదేహం లింగం అనే వ్యక్తిది అని గుర్తించి, కుటుంబసభ్యులను విచారించగా, వారి సమాధానాల పట్ల అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు
సీసీ కెమెరాల ఆధారంగా కూతురే హత్య చేసిందని నిర్ధారించి, ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే తండ్రిని చంపినట్టు విచారణలో అంగీకరించిన మనీషా
