
హనుమకొండ హంటర్ రోడ్డు లోని కోడెం కన్వెన్షన్ హాల్ నందు ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిదన్ వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వర్ రావు , టెస్కాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు….
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-..
స్వాతంత్రం తెచ్చిన నాడు బిజెపి పార్టీ ఏడ ఉన్నది…
అంబేద్కర్ ని నిండు పార్లమెంటులో అమిత్ షా అవమానపరిచిండు…
ఓటు హక్కు కల్పించి సమానత్వాన్ని కల్పించిన అంబేద్కర్ మాకు దేవుడే…
అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు ఆపాలి…
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి….
ప్రజాస్వామ్యo పై ఏ మాత్రం నమ్మకం లేని బీజేపీ కి పరిపాలించే నైతిక అర్హత లేదు….
రాష్ట్ర బీజేపీ ఎంపీల వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి ఉపోయోగం లేదు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వీళ్ళ పని అన్నారు….
నియోజకవర్గ పరిధి లోని మండల, గ్రామ నాయకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ను ప్రతి ఒకరూ బాధ్యత పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు …
కావున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ఉద్యమాని గ్రామ గ్రామానికి తీసికెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి అని కోరారు…
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….
