
ప్రగతి నగర్లో ఉల్లాస్ బార్ & కిచెన్‌ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 276 డివిజన్ ప్రగతి నగర్లో ఏనుగుల నర్సింహా రెడ్డి నవదీప్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన *ఉల్లాస్ కిచెన్ & బార్ *ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇటువంటి వాణిజ్య సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.