బుధ. మార్చి 11th, 2026

కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

WhatsApp Image 2025 03 24 at 18.19.58
WhatsApp Image 2025 03 24 at 18.19.58
TEJA NEWS

కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

భారీగా తరలివచ్చిన భక్తులు

సిద్దిపేట జిల్లా:
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద అగ్ని గుండాలను నిర్వహించారు.

వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి సోమవారం తెల్లవారు జామున ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పట్టు కుని అగ్నిగుండాలు దాటిన తర్వాత.. భక్తులు అగ్నిగుం డాలు దాటి తమ మొక్కు లు చెల్లించుకున్నారు.

దీంతో మూడు నెలలుగా సాగుతున్న బ్రహ్మోత్స వాలు అగ్నిగుండాల కార్య క్రమంతో జాతర ముగిసిం ది. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు జనవరి 19న ప్రారంభమయ్యాయి. దాదాపు మూడు నెలల పాటు సాగిన జాతర ఉత్స వాలు ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తాయి.

ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పించు కుంటారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 10 ఆదివారా లు కొనసాగాయి. 10 ఆదివారాలతోపాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

చివరి వారం కావడంతో భక్తులు స్వామి వారి క్షేత్రా నికి భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అగ్ని గుండాల మీదుగా నడిచి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు.

స్వామి వారి దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పట్టింది. గుట్టపై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page