TEJA NEWS

కృష్ణాజిల్లా గుడివాడ సబ్ డివిజన్ అధికారుల సన్మానం, గుడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న ఎస్సై ప్రసాద్ అను నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల నాలుగు నెలల సుదీర్ఘమైన పోలీసు జీవనం చేసి కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్ గా ఏఎస్ఐ గా ఎస్సైగా రెండు పర్యాయాలు గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐగా పదవీ బాధ్యతలతో పై అధికారులందరి ప్రోత్సాహంతో గుడివాడ ప్రజల ఆశీస్సులతో అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన అనుభూతిని పొంది గుడివాడ ప్రజానీకంలో ఒక బాధ్యత గల ఎస్సైగ అందరి మన్నలను పొందిన నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని అని చెప్పటానికి ఎలాంటి సందేహము లేదు గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు నాకు ఇచ్చిన అపూర్వమైన అనుభూతిని ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రజల రుణాన్ని తీర్చుకోలేను ప్రతి ఒక్కరూ నా ఆత్మబంధువుగా, నన్ను ఆదరించి, నామీద చూపించిన ప్రేమాభిమానాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సమాచారాన్ని నా మీడియా మిత్రుల ద్వారా ఈ గుడివాడ మరియు పరిసర ప్రాంత వాసులకు తెలియపరచుటకుగాను మిమ్మల్ని అందరిని ప్రార్థించడమైనది ఇట్లు గుడివాడ ప్రజల ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ మీ అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నాను