
యువతకు ఆదర్శం మైలవరపు కృష్ణతేజ
కృష్ణతేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు మండలనేని చరణ్‌తేజ
చిలకలూరిపేట:
మీరు మీ కోసం జీవిస్తే మీరు మీలోనే నిలచిపోతావు. మీరు జనం కోసం జీవిస్తే మీరు జనంలో నిలచిపోతావు అన్న భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పూర్తిని అనుసరిస్తూ. ప్రజల కోసం పాటు పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ మైలవరపు కృష్ణతేజ ప్రజల కష్టసుఖాలలో అండగా నిలుస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా, సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ ఆకాంక్షించారు. బుదవారం మైలవరపు కృష్ణతేజ తన జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్బంగా చరణ్‌తేజ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చరణ్‌తేజ మాట్లాడుతూ మానవత్వమే నా పదం,,,సేవాతత్పరతే నా పథం అంటూ కేరళ రాష్ట్రంలో వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన యువ ఐఏఎస్ అధికారి ప్రస్థానం నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. భావితరం భవిష్యత్తు కోసం, వారిలో మార్పు కోసం కృష్ణతేజ అనుక్షణం శ్రమిస్తారని, నేటి యువతకు ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకమన్నారు.
