TEJA NEWS

కేటీఆర్ ఆరోపణలు – ICICI బ్యాంక్ కౌంటర్

ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కానీ.. టీఎస్‌ఐఐసీకి కానీ ఎలాంటి మార్టిగేజ్ రుణం మంజూరు చేయలేదని . అలాగే బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసీ ..తమ వద్ద అంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఎలాంటి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదని ప్రకటించింది. తాము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంట్ బ్యాంక్‌గా వ్యవహిరంచామని స్పష్టం చేసింది.

కంచ గచ్చిబౌలి భూముల్ని తాకట్టు పెట్టుకుని పది వేల కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిందని ఇది ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడమేనని కేంద్రం దర్యాప్తు చేయాలని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు. మొత్తం పది వేల కోట్ల స్కామ్ అని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వెల్లడించిన వివరాల్లో అసలు స్కామ్ ఏమిటంటే.. తమది కాని భూమిని టీఎస్ఐఐసీ తాకట్టు పెట్టిందని.. ఆ భూమి వారికి చెందిందో కాదో తెలియకుండా బ్యాంకు రుణం ఇచ్చిందన్న పాయింట్ మాత్రమే కనిపిస్తోంది. ఆ పాయింట్ కు ఇప్పుడు బ్యాంక్ వివరణ ఇచ్చింది.

ఐసీఐసీఐ బ్యాంక్ తప్పు చేసిందని ఆ బ్యాంక్ దివాలా తీస్తుందన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేయడం ప్రారంభించారు. కేటీఆర్ నేరుగా బ్యాంక్ పేరు పెట్టి ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఇప్పుడు తాను చేసిన ఆరోపణలకు కేటీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే ఓ బ్యాంక్ మీద తప్పుడు ఆరోపణలతో కుట్ర చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటారు.