TEJA NEWS
  • గోపాల్ పేట్ మండల బి సి ఎఫ్ అధ్యక్షులుగా కురుమన్న యాదవ్: నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండల బిసి ఫెడరేషన్ అధ్యక్షులుగా కురుమన్న యాదవ్ కు బీసీఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నియామక పత్రం అందచేయడం జరిగింది. నూతనంగా మండల అధ్యక్షులుగా నియామకమైన కురుమన్న యాదవ్ మాట్లాడుతూ గోపాల్ పేట్ మండలలో గ్రామ గ్రామంలో కమిటీలు వేసి బి. సి. ఎఫ్. ను బలోపేతం చేసి బీసీ ఉద్యమాన్ని నిర్మించి 42 శాతం రిజర్వేషన్ సాధిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బి. సి. ఎఫ్. రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ ప్రకారము రిజర్వేషన్లు ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం జీవో తీసినంత మాత్రాన చట్టబద్ధత ఉండదు మళ్ళీ కోర్టుకు పోయే అవకాశాలుంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆర్డినెన్స్ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చాలని చెన్న రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.సి.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ , బి సి ఎఫ్ జిల్లా అధ్యక్షులు కురుమూర్తి , ఎస్సీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేష్ తదితరులు పాల్గొన్నారు.