
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం – మహాదేవపురం
మహాదేవపురం పరిధిలోని ఖైలాష్ హిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీ శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ సందేశ్ రెడ్డి, పీవీ రాజు ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సౌభాగ్యాలతో సుభిక్షంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు సిద్దనోల సంజీవరెడ్డి,గంగుల అంజలి యాదవ్ , రాంచేందర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి,కృష్ణ రెడ్డి, నరేందర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, మహేష్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు