
కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్*
పిడుగురాళ్ల
కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ కార్మికులే.. శ్రమనే నమ్ముకుని పనిచేసే ప్రతి ఒక్కరూ శ్రామికులే.. అలాంటి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. విడుదల చేసిన పత్రికా ప్రకటనలో డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశ శ్రేయస్సు కోసం ఎండనకా, వాననకా కాలాలకు అతీతంగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రామికులు ఈ దేశ ప్రగతికి మూలాలన్నారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదన్నారు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశం ప్రగతిశీల మార్గంలో నడవబోధనడంలో అతిశయోక్తి కాదని పేర్కొన్నారు. గుండు పిన్ను నుంచి విమానం వరకు ప్రతి వస్తువు తయారీకి శ్రామికుల శ్రమ ఎంతో ఉంటుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని అలాంటి కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలని ( మేడే ) డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ చెప్పారు.
