
లక్షల డప్పులు – వేల గొంతులు ప్రదర్శన వాయిదా.!
- నేడు చేపట్టాల్సిన వేల గొంతులు – లక్షల డప్పులు సాంసృతిక మహాప్రదర్శనను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వాయిదా పడిందని ఎంజెఎఫ్ జనగామ జిల్లా కోశాధికారి భాషిపాక ఎల్లేష్ తెలిపారు.
- ఈ విషయాన్ని మాదిగ, ఉప కులాల ప్రజలు గమనించాలని, త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారని, ఎస్సీ వర్గీకరణకు శాసన సభ ఆమోదం తెలిపిన నేపథ్యంతో దానిలో జరిగిన లోపాలను సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
