TEJA NEWS

లక్ష్మీ బాలాజీ మైన్స్ అండ్ మినరల్స్ నూతన వాహనాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న దారపనేని

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని లక్ష్మీ బాలాజీ మైన్స్ అండ్ మినరల్స్ నూతన వాహనాల పూజా కార్యక్రమం మాలకొండలో వెలసి ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని లక్ష్మీ బాలాజీ మైన్స్ అండ్ మినరల్స్ వడ్లమూడి నాగేంద్రబాబు, పువ్వాడి రాంబాబులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ లక్ష్మీ బాలాజీ మైన్స్ అండ్ మినరల్స్ అధినేతల వ్యాపార అభివృద్ధి దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల బాబురావు, నాదెండ్ల మనీ, వేద పండితులు చిమట కార్తీక్ స్వామి పాల్గొన్నారు.