
ప్రత్యేక అలంకరణలో లక్ష్మీ చెన్నకేశవస్వామి
సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) : మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి తదుపరి అష్టోత్తర శతనామావళి చేసారు.అర్చకుడు మాట్లాడుతూ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు మరియు అలంకరణ నిర్వహిస్తామని తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించి తరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్, ఛైర్మెన్ గుకంటి రాజబాబు భక్తులు బొమ్మిడిల చెన్నకేశవులు,ముడంభై సారిక, గుజ్జా శ్రీదేవి,గవ్వ విజయలక్ష్మీ,మెరెడ్డి సువర్ణ, సోమగాని అనిత తదితరులు పాల్గొన్నారు.
