బుధ. మార్చి 11th, 2026

“లక్ష్మి దేవి” అలంకరణలో అమ్మవారు

WhatsApp Image 2025 09 29 at 4.52.08 PM
WhatsApp Image 2025 09 29 at 4.52.08 PM
TEJA NEWS

“లక్ష్మి దేవి” అలంకరణలో అమ్మవారు

శ్రీ శ్రీ శ్రీ నాగవరపమ్మ దేవస్థానం నవరాత్రులు

ఉభయ నైవేద్యం సమర్పించిన బలిజ పాళెం వాసులు

కోవూరు మండలం శ్రీ శ్రీ శ్రీ నాగవరపమ్మ దేవస్థానం నవరాత్రుల మహోత్సవాలు ప్రధాన అర్చకులు విశ్వనాథం సుబ్బరామయ్య పర్యవేక్షణలో 5వ రోజు “లక్ష్మీ దేవి”గా అమ్మవారు, భక్తిశ్రద్ధలతో మంగళ వాయిద్యాలతో, బాణాసంచారితో, కోలాటాలు, తప్పెట్లు, కీలు గుర్రాలు, బొమ్మల వేషధారణతో టి. ఎన్. సి. ఎదురు సందులో ఉన్న మహాలక్ష్మమ్మ దేవస్థానం అమ్మవారికి, పోలేరమ్మకు, పోతురాజుకు, ప్రత్యేక పూజలు చేయించి ఊరేగింపుగా “బలిజ పాళెం వాసులు”, కోవూరు గ్రామ దేవత అయిన “నాగవరపమ్మకి” ఉభయ నైవేద్యాములు సమర్పించుకున్నారు. బలిజ పాళెం వాసులు దేవస్థానం ముందు ఏర్పాటుచేసిన “కైలాసంలో శివుడు” భక్తులందరిని ప్రత్యేకంగా ఆకర్షించింది. వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులందరూ దసరా నవరాత్రులు అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఈ దైవ కార్యక్రమములో బలిజ పాళెం వాసులు, కోవూరు మండల ప్రజలు, పాల్గొనడం జరిగింది.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page