TEJA NEWS

అంగరంగ వైభవంగా
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సం

  • పూజలో పాల్గొన్న వంగ మాధవి,రాజశేఖర్ రెడ్డి
  • ఆలయ చైర్మన్ పుల్లగూర్ల కృష్ణారెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోహారే సహస్ర నామతతుల్యం రామనామ వరాననే…అంటూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధి కుర్మిద్ద గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. పచ్చని పందిర్లు, శోభాయమానమైన విద్యు త్ దీపాలతో దేదివ్యమానంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం విరాజిల్లుతోంది… ఆదివారం ఉదయం సుప్రభాతం, స్వామివారికి విశేష అభిషేకం, విశ్వేక్షణ ఆరాధన, పుణ్య హవాంఛనం, అంకురోపణ, ధ్వజరోహణ, హెూమము, అన్నదాన వితరణ, నివేదన నీరాజనం తీర్థ ప్రసాద వియోగం కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి.

ఈ పూజత్సోవాల్లో కుర్మిద్ద గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులైయ్యారు. స్వామి వారి దర్శణనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఆలయ చైర్మన్ పుల్లగూర్ల కృష్ణారెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ అన్ని ఏర్పాట్లను చేపట్టారు.ఆలయ చైర్మన్ పుల్లగూర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ
కుర్మిద్దలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామంలోని పెద్దలందరు సహకరించారని అన్నారు. అదేవిధంగా ఆలయంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనీ ఆలయ కమిటీ సభ్యుల ద్వారా చర్చించి త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు,యువకులు,భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.