
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం
వనపర్తి
వనపర్తి పట్టణంలోని శంకరగంజి లక్ష్మీ నరసింహ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ వస్తుందని వారి తెలిపారు ఈ కార్యక్రమానికి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పురోహితులు బృహస్పతి శర్మ లీలానాథ శర్మ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
