Spread the love

ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.

సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు.

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌’ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 మధ్య కాలానికి సంబంధించినది. ఆయన హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే గ్రూప్ డీ పోస్టుల్లో కొందరికి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలున్నాయి.

అందుకు ప్రతిగా లాలూ కుటుంబ సభ్యులు, ఇతర అనుచరుల పేరిట భూములను రిజిస్టర్ చేయించున్నారని సమాచారం. ఈ కేసులో క్రిమినల్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు లాలూ కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించాయి.