
ఏపీయూడబ్ల్యూజే ,ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో లస్సి-మజ్జిగ పంపిణీ
ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేసిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
చిలకలూరిపేట:వేసవిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల దాహార్తి తీర్చటానికి ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో మజ్జిగ, లస్సీ అందజేయడం అభినందనీయమని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు,పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రత్తిపాటి పుల్లారావు గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధంమైన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఫిర్యాదు దారులకు మజ్జిగ, లస్సీ లను అందజేశారు.ఈ సందర్బంగా జర్నలిస్టులు వార్త సేకరణ విధులతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా జెసి జి. సూరజ్ ధనుంజయ్,డి ఆర్ ఓ మురళి, నరసరావుపేట ఆర్డీవో మధులత,ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా అశోక్ కుమార్,ప్రెస్ క్లబ్ సెక్రటరీ షేక్ దరియావలి పలువురు అధికారులు నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీయుడబ్ల్యూజే నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవీ సుబ్బారావు సేవా కార్యక్రమాలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఫిర్యాదుల దినోత్సవం లో తాము వచ్చిన ఫిర్యాదుదారులకు అధికారులకు మజ్జిగ లస్సీ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏపీయుడబ్ల్యూజే పిలుపుమేరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కొచ్చర్ల చందు, నాదెండ్ల సుందర్ బాబు, రావిపాటి రాజా, పెనుమల మనోహర్, కొండపాటి రమేష్, కొనికి సాంబశివరావు, నరసింహల శ్రీకాంత్, అమ్మనబ్రోలు శివ నారాయణ,అధికారులు పలువురు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
