
నూతన హాచ్.డి.ఎఫ్.సి బ్యాంకును ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ 26వ వార్డులోని కేవీఆర్ వ్యాలీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హాచ్.డి.ఎఫ్.సి(HDFC) మల్లంపేట్ శాఖా బ్యాంకును ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, నాయకులు శ్రీశైలం యాదవ్, కొసరు రవి, కాలనీ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్, బ్రాంచ్ మేనేజర్ చిరంజీవి మరియు కాలనీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..
