TEJA NEWS

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నాయకులు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ : బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

131 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ ప్రాంతానికి చెందిన కొడవటి లక్ష్మీ నరసింహ తండ్రి శ్రీనివాస్ రావు (20) ఆరోగ్య పరిస్థితిపై స్థానిక నాయకులు బిఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దృష్టికి తీసుకురాగా వారి ఆర్థిక పరిస్థితి చలించిన ఎమ్మెల్యే మెరుగైన వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొడవటి లక్ష్మీ నరసింహకు 3.00 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేయించగా చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ లబ్ధిదారునికి ఎల్ఓసీ చెక్కును పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…..ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నాయకులు, కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయలను మంజూరు చేయించడం పేద ప్రజల పట్ల వారికున్న ప్రేమను తెలియజేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, సీనియర్ నాయకులు అడప శేషు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.