
నిరుపేదలకు సన్న బియ్యం ఒక వరం: చేవెళ్ళ “శాసనసభ్యులు కాలే యాదయ్య” ..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంలో భాగంగా చేవెళ్ళ నియోజకవర్గం చేవెళ్ళ మునిపాలిటీ కేంద్రంలో కందడ మాణిక్యం ఇంటిలో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక “శాసనసభ్యులు కాలే యాదయ్య” ..
ఈ సందర్భంగా శాసనసభ్యులు “కాలే యాదయ్య” మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపడంతోపాటు వారి కళ్ళల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చుట్టిందన్నారు. కందాడ మాణిక్యం కుటుంబ సభ్యులతో కలిసి సన్న బియ్యం తో వండిన భోజనాన్ని తినడం జరిగిందని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో ప్రజా,ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
