TEJA NEWS

కొబ్బరి తోటలో చిరుత హల్ చల్ : అధికారులు ఏమన్నారంటే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట మండలం పేట మాలపల్లి కొబ్బరి తోటలో చిరుత సంచరించిందనే స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కానీ ఆ ప్రదేశంలో చిరుత, హైనా ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. మరియు ఆ ప్రాంతంలో వర్షం పడటం వల్ల ఎలాంటి ఆనవాళ్లు గుర్తించటానికి లేవని తెలియజేశారు. కావున ప్రాంతవాసులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు