
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మహేశ్వరంలో డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. ఈ సందర్భంగా వారి విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి.. అణగారిన వారిని ఆకాశానికి ఎగసేలా చేసిన శక్తి, రాజ్యాంగ రూపకర్త, డా.బిఆర్ అంబేడ్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, శామీర్ పేట్ హనుమంత్ రావు, నాయకులు ఉట్ల శ్రీహరి, ఉట్ల లక్ష్మి నారాయణ, నిరుడు గణేష్, నాగారం జితయ్య, వడ్డే యాదయ్య, నిరుడు పరమేష్, ఐలాపురం శంకర్, మల్లెల సాయిలు, నాగారం క్రిష్ణ, నాగారం నరేష్, శ్రీశైలం యాదవ్, రమేష్, నిరుడి రాజు, నర్సింగ్ రావు, మల్లెల మనోహర్, మనోజ్, సునీల్ రావు, ఆకాష్, బిఆర్ఎస్ మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ మైసిగారి శ్రీకాంత్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు…
