TEJA NEWS

వరంగల్‌లో జరగబోయే రజతోత్సవ సభని విజయవంతం చేద్దాం: మెతుకు ఆనంద్

ఈ నెల 27 న వరంగల్‌ లో నిర్వహించనున్న రజతోత్సవ సభ ని విజయవంతం చేయడానికి గాను.. వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి లో గల BRS భవన్ (BRS పార్టీ జిల్లా కార్యాలయం)లో నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి మరియు రోహిత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ సమావేశంలో భాగంగా వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీతో 25 ఏండ్లు కావొస్తున్న శుభ తరుణంలో వరంగల్ లో నిర్వహించబోయే రజతోత్సవ సభకు BRS పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా నుంచి 150 నుండి 200 వరకు ప్రత్యేక బస్సులలో మరియు నాయకులు, కార్యకర్తల సొంత వాహనాలలో బయలుదేరడం జరుగుతుందని తెలిపారు.

సమావేశానికి బయలుదేరేముందు ఉదయం జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో BRS పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన చలో వరంగల్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ సమావేశంలో TSEWIDC మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ , BC కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ , గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ , ZP మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ , రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి , వికారాబాద్ పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ మరియు జిల్లాలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, కార్యనిర్వాహక అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు