TEJA NEWS

వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి.

పీజీఆర్ఎస్ కు 42 వినతులు.

కమిషనర్ ఎన్.మౌర్య

వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్ కి ఫోన్ ద్వారా 10 మంది సమస్యలు తెలుపగా, 32 మంది నేరుగా వచ్చి కమిషనర్ కు వినతులు అందజేశారు. శ్రీనివాసపురం వద్ద డ్రైనేజీ కాలువ పనులు చేయాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ నందు నీరు వృథా చేస్తున్నారని, ఒకే సమయంలో నీరు సరఫరా చేయాలని, మా ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్టు తొలగించాలని, భవానీ నగర్ నందు డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేపట్టాలని, గెస్ట్ లైన్ డేస్ హోటల్ సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్డులో భూమి కోల్పోయాను టిడిఆర్ బాండ్ ఇప్పించాలని, సాయి విష్ణు లేఔట్ నందు తుడా రోడ్డులో ఆక్రమణ నిర్మాణాలు తొలగించాలని, రైల్వే స్టేషన్ వద్ద తమ బంక్ తొలగించారు, బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఏర్పాటు చేసుకుంటానని కోరారు, వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి నాయకులు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఎక్కడా మురుగునీరు ఆగకుండా, చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, ఏసిపిలు బాలాజి, మూర్తి సర్వేయర్ కోటేశ్వర రావు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.