Spread the love

ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారే చెత్త నిర్వహణ చేసేలా చూడండి..

*కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే అపార్ట్మెంట్స్, వాణిజ్య సముదాయాల (బల్క్ జనరేటర్స్) వారు సొంతంగా చెత్త నిర్వహణ చేసుకునేలా అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడిచెత్తను వాళ్ళ పరిధిలోనే కంపోస్ట్ ఎరువుగా మార్చుకునేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, హోటల్స్, వాణిజ్య సముదాయాల వారు అన్నారు.

ఉపాద్యాయ నగర్ లోని అపార్ట్మెంట్ల వద్ద చెత్త నిర్వహణ చాలా చేశారని ఆవిధంగా నగరంలో బల్క్ వెస్ట్ జెనరేటర్ చేసేలా చూడాలని అన్నారు. అలాగే హోమ్ కంపోస్టు తయారు చేసేలా చూడాలని అన్నారు. ఇలా చేయడం వలన చెత్త సేకరణ, నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు. ఆ దిశగా అధికారులు అన్ని వార్డుల్లో చేయాలని అధికారులను ఆదేశించారు. వినాయక సాగర్ లో స్విమ్మింగ్ పూల్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. బైరాగిపట్టెడ లోని రామానాయుడు స్కూల్ లో చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేయటాన్ని పరిశీలించారు. స్కూల్ గోడలకు పెయింటింగ్ చేయించాలని అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రమణ, మహేష్ , ఏసిపిలు బాలాజీ, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు , శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.