
*తెలుగుజాతికి, తెలుగుదేశానికి మహానాడే పెద్దపండుగ.
కార్యకర్తలు ఎంత ఓర్పుతో ఉంటే అంత ప్రతిఫలం పొందుతారు. మాజీమంత్రి ప్రత్తిపాటి
రాష్ట్రాభివద్ధి, ప్రజల సంక్షేమం తర్వాత చంద్రబాబు ఆలోచన టీడీపీ కార్యకర్తలే.
ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై వైసీపీ దుష్ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు ధీటుగా తిప్పికొట్టాలి
- పల్నాడు జిల్లా మహానాడులో మాజీమంత్రి ప్రత్తిపాటి.
నరసరావుపేట తెలుగుజాతికి, తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమమే పెద్దపండుగని, తెలుగుదేశం పార్టీ పేరుప్రఖ్యాతులు కొనసాగించడంతో పాటు, పార్టీ విధివిధానాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమంపై చర్చించే ప్రధాన వేదిక మహానాడు అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
నరసరావుపేటలోని టౌన్ హాల్లో జరిగిన పల్నాడు జిల్లా స్థాయి మహానాడులో పార్టీ ప్రధాన నాయకులు, శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమంతో పాటు కార్యకర్తలకు మేలుచేయాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉందని, వారి రుణం ఎలా తీర్చుకోవాలనే దానిపైనే ఆయన తపనపడుతుంటారన్న ప్రత్తిపాటి, అప్పటివరకు టీడీపీ శ్రేణులు సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలన్నారు. మీరు, మేము ఎవరైనా ఎంత ఓర్పుతో ఉంటే ప్రతిఫలం అంతగొప్పగా ఉంటుందన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అందరం ఇబ్బందులు పడినవాళ్లమేననే వాస్తవం గ్రహించాలన్నారు. గత ప్రభుత్వ తప్పుల్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని ఎలాగైతే గట్టెక్కిస్తున్నారో, అదేవిధంగా భవిష్యత్ లో కార్యకర్తల కష్టానికి కూడా అధినాయకత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. కార్యకర్తల మనసుల్లో ఏముందో మాతో పాటు, అధినాయకత్వానికి కూడా బాగా తెలుసునన్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాలపై వైసీపీ దుష్ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలి
సూపర్-6 పథకాలన్నీ ప్రభుత్వం కచ్చితంగా అమలుచేస్తుందని, పథకాల అమలుతో పాటు, ప్రభుత్వ పనితీరుపై వైసీపీ దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఎంతో ధీటుగా సమర్థవంతంగా తిప్పికొట్టాలని ప్రత్తిపాటి సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నిమిషం సమయం వృథా చేయకుండా, రాష్ట్రం.. ప్రజలకోసం ఎంతో కష్టపడుతున్నారని, ఈ సందర్భంలో మూడుపార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందరం కలిసి ఉంటేనే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే నంబర్-1 గా నిలుస్తుందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే వెనుకబాటు ప్రాంతమైన పల్నాడు రూపురేఖలే మారిపోతాయన్న ప్రత్తిపాటి, గతంలో కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నప్పుడు గోదావరి, కృష్ణా-పెన్నా అనుసంధానంలో భాగంగా నకరికల్లులో రూ.6వేలకోట్ల పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు పల్నాడు జిల్లాకు తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు.
నరసరావుపేటలో జరిగిన జిల్లా మహానాడులో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ జీ.వీ.ఆంజనేయులు, గురజాల, మాచర్ల, పెదకూరపాడు శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మనందరెడ్డి, భాష్యం ప్రవీణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
