
మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో దళిత బహుజన నాయకులు పూలమాలలతో ఘనంగా మహాత్మ జ్యోతి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. సామాజిక తత్వవేత్త,నవయుగ వైతాళికుడు,సామాజిక అసమానతలు తొలగించిన క్రాంతిరేఖ దీనజనుల జీవితాల్లో వెలుగురేఖ అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎంతో కృషిచేసిన నిత్య స్ఫూర్తి ప్రదాతగా,సంఘసంస్కర్తగా, సామాజికవేతగా,సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషిచేసి కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి,మహిళా విద్య అభివృద్ధికి విశేష కృషిచేసిన బలహీనవర్గాల భవితకు మార్గదర్శి, మానవతవాది,మహనీయుడు సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి,1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతరలో జన్మించిన పూలేతండ్రి గోవిందారావు తల్లి చీమ్నబాయ్ కుటుంబం పూలవ్యాపారం చేసుకొని బతికేవారు అందుకేవారికి పూలే అనేపేరు వచ్చిందిని దేశంలో బాలికల కొరకు మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటుచేసి మహిళలకు విద్యను అభ్యసించే విధంగా కృషిచేసి మహిళల జీవితాల్లో వెలుగులునింపినచరిత్ర మహాత్మ జ్యోతిరావుపూలే సావిత్రిబాయి పూలే దంపతులకే చెందుతుందని వారిజయంతిని పురస్కరించుకొని తలకొండపల్లి బహుజన సంఘాల నాయకులు అన్నారు, వారి సేవలను మేము ఎప్పుడు ఎల్లవేళలా పాటిస్తామని వారు అన్నారు.
