TEJA NEWS

మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే
ఎంపి కేశినేని కార్యాల‌యంలో పూలే 199వ జ‌యంతి కార్య‌క్ర‌మం

విజ‌య‌వాడ : దేశంలోనే తొలి బాలికా పాఠ‌శాల‌ను ప్రారంభించి మహిళల విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త, స‌మాజం కోసం త‌న జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జ‌యంతి కార్య‌క్ర‌మం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కార్యాయ‌లంలో శుక్ర‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర‌ప‌టానికి నాయ‌కులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే కొత్తదారి చూపించ‌టంతో పాటు, చేయి పట్టి నడిపించారన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటిచెప్పారని వారి సేవ‌ల‌ను కొనియాడారు.. భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం వేసిన‌ మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు. అంబేద్కర్, పూలే గారి ఆదర్శాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ అధ్య‌క్షుడు న‌మ్మిభాను ప్ర‌కాష్ యాద‌వ్, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ సింగం వెంకన్న, మైల‌వ‌రం మార్కెట్ యార్డ్ చైర్మ‌న్ ఉయ్యూరు న‌ర‌సింహారావు,టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి పాల మాధ‌వ , రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్ర‌తినిధి ప‌రిశ‌పోగు రాజేష్ (ద‌ళిత‌ర‌త్న‌), రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేట‌ర్ చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు క‌రీముల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా బిసి సెల్ నాయ‌కుడు ఉప్ప‌డి రాము, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ కార్య‌ద‌ర్శి చింత‌ప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, ఎన్టీఆర్ జిల్లా ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్స్ మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేట‌ర్ కాకు మ‌ల్లిఖార్జున యాద‌వ్, బిసి సంఘ నాయ‌కులు ప‌ట్నాల హ‌రిబాబుటిడిపి సీనియ‌ర్ నాయ‌కులు న‌ర‌సింహా చౌద‌రి, న‌గ‌ర అర్బ‌న్ మైనార్టీ సెల్ మాజీ అధ్య‌క్షుడు ఎమ్.డి.ఇర్ఫాన్, 7వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు ప‌ట‌మ‌ట స‌తీష్ చంద్ర‌, 44వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు బొడ్డుప‌ల్లి శ్రీనివాస్, 42వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు ముదిరాజు శివాజీ, 43వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు కునికి కొండ‌య్య, టిడిపి నాయ‌కులు ముదికొండ శివ‌, బోగ‌వ‌ల్లి నాగ‌బాబు, త‌మ్మిన శేఖ‌ర్, ఆర్య‌క‌టిక ఉమామ‌హేశ్వ‌ర‌రావు, డబ్బుకొట్టు ఏడుకొండ‌లు, న‌గ‌రాల సాధికార‌త క‌మిటి క‌న్వీన‌ర్ మ‌రుపిళ్ల తిరుమలేష్, దేవర‌క‌ళ్యాణ్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.