TEJA NEWS

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి_

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందర బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి ఫోటోకి పూలమాలల తో ,
ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత సామాజిక పునర్నిర్మాణానికి దిక్సూచి అణగారిన వర్గాలకు అద్దంపట్టిన మహానాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమాజంలో అంటరానితనం లింగ వివక్షకతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని నమ్మి బడుగు బలహీనవర్గాలు సామాజికంగా ఆర్థిక అభివృద్ధి చెందుతారని స్త్రీల అభివృద్ధి దేశ అభివృద్ధి అని నమ్మి సమాజానికి విద్యాబుద్ధులు చెప్పి భారత దేశంలో శూద్రులకు అతిశూద్రులకు భారతదేశానికి అక్షర జ్ఞానాన్ని అందించిన ఆది గురువు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు అదేవిధంగా వివిధ పార్టీలు సంఘాల వారు కూడా పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.