
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి నాయకుల ఘన నివాళులు
దాచేపల్లి
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దాచేపల్లి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు.
అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని, స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త అని, సమసమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు.
ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకం
పూలే ఆశయ సాధనకు పునరంకితం కావడమే మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు.
