
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నుండి బాచుపల్లి వరకు వెళ్లే రోడ్డు ను హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమన్వయం లోపంతో నిధులు లేక రోడ్డు ను పూర్తిచేయందున స్థానిక ప్రజలు ఇబ్బందులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రోడ్డు సమస్య ఉందని మంత్రికి విన్నవించగా వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
