
మనిషి గొప్ప వ్యక్తిత్వానికి ప్రతీక రక్తదానం……. సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి
మనిషిలోని గొప్ప ఔన్నత్యానికి వ్యక్తిత్వానికి ప్రతీక రక్తదానం అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జైభీం సంస్థ మరియు మాల మహానాడు సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వాహకులు రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ మనిషికి మనిషి తోడ్పడటంలో అత్యంత గొప్పమైనది రక్తదానమని ఏడాదికి రెండు లేదా మూడు సార్లు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.దాతలు ఇచ్చిన రక్తం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన స్పష్టం చేశారు.భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అని శంకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోబండారు శ్రీనివాస్,జెట్టి రాంబాబు, యం.మద్దిలేటి,బండారు సురేందర్,బి.నాగరాజు,సహదేవుడు, రమేష్ , కృష్ణయ్య రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.
సంస్థల ప్రతినిధులు కంటే నిరంజనయ్య,పావనం చంద్ర శేఖర్,మాజీ ఎం పి పి శైలజ కురుమూర్తి,జనజ్వాల గంధం నాగరాజు,బైరోజు చంద్ర శేఖర్,రాధాకృష్ణ, కర్నె త్యాగయ్య,లక్ష్మణ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీ టెక్నీషియన్స్ సంతోష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
