ఎక్లాస్‌పూర్‌లో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మనాలి రాజ్ ఠాకూర్

TEJA NEWS

ఎక్లాస్‌పూర్‌లో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మనాలి రాజ్ ఠాకూర్…

అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంల పంపిణీ…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: అంతర్గాం, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అంతర్గాం మండలం, ఎక్లాస్‌పూర్ గ్రామంలో ఎక్లాస్‌పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అడెపు తిరుపతి – స్వరూప దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎక్లాస్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు. పిల్లల విద్యాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్లాస్‌పూర్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అనంతరం ఎక్లాస్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన మనాలి రాజ్ ఠాకూర్ చిన్నారులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం విద్య, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భావితరాల అభివృద్ధికి విద్యే బలమైన పునాది అని అన్నారు. చిన్నారుల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎక్లాస్‌పూర్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top